హైదరాబాద్ ఆగష్టు 23 ();సికింద్రాబాద్ లోని సెకబాడ్ పేమెన్‌క్యాప్ లో మానసిక వికలాంగులకు హీల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో స్వచ్ఛంద సంస్థ సభ్యులు బి.శ్రీనివాస రెడ్డి, పి.ఉషా రాణి ,పి.జగదీష్ కుమార్ ,జగదాంబ,కాకుమానుతారెడ్డి, .రాజు, ఎం.శ్రీలక్ష్మి కడప, సభ్యులందరూ బిస్కెట్లు చాక్లెట్లు పెన్సిల్ పుస్తకాలు పంపిణీ చేసారు. అక్కడి మానసిక వికలాంగుల స్థితి గతులను తెలుసు కొన్నారు. ఈ సందర్బంగా కాకుమాను జ్యోతి మాట్లాడుతూ వికలాంగులకు హీల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అన్నివేలల అందుబాటులో ఉంటూ సహాయ సహాకారాలు అందించనున్నట్లు తెలిపారు.