బీసీలను వంచిస్తున్న రాజకీయ పార్టీలు
గర్జన పోస్టర్ ను ఆవిష్కరించిన బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
వరంగల్ ఆగష్టు 23 ( ) : బీసీలను రాజకీయ పార్టీలు వంచిస్తున్నాయని, బీసీల రాజకీయ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఆరోపించారు.. బుధవారం వరంగల్ పోచమ్మ మైదాన్ లోని డీసెంట్ ఫంక్షన్ హాల్ లో ఓరుగల్లు బీసీ రాజ్యాధికార గర్జన ఆహ్వాన కమిటీ చైర్మన్ ధర్మపురి రామారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి దాసు సురేశ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి వివిధ కుల సంఘాలు , ప్రజా సంఘాల , ఉద్యమ సంఘాల నాయకుల సమక్షాన ఘనమైన నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు..తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసు సురేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో పరిగణించకపోవడం, కోరుట్లలో తమ సంఘటిత శక్తిని ప్రదర్శించిన పద్మశాలిలను కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం చేయడం, విశ్వబ్రాహ్మణులను, పెరిక ,నాయి బ్రాహ్మణులను, కురుమ, కుమ్మరి వర్గాలకు ఏమాత్రం ప్రాతినిధ్యం కల్పించకపోవడం దేనికి నిదర్శనం అన్నారు. బీసీలకు అగ్రవర్ణ పార్టీలు ఎన్నటికైనా అద్దె కొంపలేనన్నారు..సొంత పార్టీ నిర్మాణానికి బీసీలు సిద్ధమవుతున్నామన్నారు. ఆగస్ట్ 27న ఆదివారం వరంగల్ లో జరిగే బిసి రాజ్యాధికార గర్జనకు పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి బీసీ నాయకులు, జర్నలిస్టులు,అన్ని కులాల ప్రతినిధులు ,ప్రొఫెసర్లు,కళాకారులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమానికి బీసీ సోదరి సోదరమణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు..ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులను, అన్ని గ్రామ పంచాయితీల వార్డు మెంబెర్లను సర్పంచులను ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్మన్ లను ,మేయర్ లను ,కులసంఘాల నాయకులను, మహిళా సంఘాలను విద్యార్థి ఉద్యోగ జర్నలిస్ట్ నాయకులను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమానికి కన్వీనర్లు యుగేందర్ యాదవ్, కేడల ప్రసాద్ చేపూరి ఓదెలు ఆడేపు నగేష్ నేత, చింతాల అనిల్, అల్లాడి యాకయ్య, కీర్తి జయంతి, సాంబరాజు ప్రభాకర్, కడారి రవి, పరిమళ లక్ష్మణ్, సదానందం,మడత కిషోర్,యాదగిరి, గీసబోయిన ఆకాష్, బేతి రమేష్, బేతి రాజు, సట్ల సాయి, సంతోష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.