శ్రీనివాస్ యాదవ్ కు తిరిగి సనత్ నగర్ సీటు కేటాయించడంతో పుల బుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ బి.ఆర్.ఎస్ నాయకుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తిరిగి సనత్ నగర్ సీటు కేటాయించడంతో పుల బుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ బి.ఆర్.ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చి హట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా గోషామహల్ నియోజకవర్గంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన తాను వారి గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. తాను 35 ఏళ్లుగా గోషామహల్ నియోజకవర్గ ప్రజలతో ఉన్నానని వారి సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నానని తెలిపారు. తాను ఓడిపోయిన కూడా నియజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉంటున్నానని వివరించారు. మంత్రి తలసాని సహకారంతో ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించనని వివరించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గోషామహల్ లో బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి నందు కుమార్, బిర్జు కుమార్ జైస్వాల్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.