ఇంటి వద్ద మంగళ హారతి తో స్వాగతం
మెదక్ తూప్రాన్ జనవరి 6 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో స్థానిక వినాయకుడు విగ్రహం వద్ద అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి శ్రీ రాములవారి అయోధ్య అక్షింతలు కలుశానికి పూజలు నిర్వహించి
ప్రతి ఇంటికి అయోధ్య రాముడి గడపగడపకు అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం వితరణ చేశారు.
అక్షింతల కలశానికి ప్రతి ఇంటి వద్ద మంగళ హారతితో స్వాగతం పలికారు.
హిందువుల చిరకాల స్వప్నం రామ జన్మభూమి అయోధ్యలో రాముని ఆలయం ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషంగా ఉందని , అయోధ్య రాముని అక్షింతలు ప్రతి ఇంటికి అందడం అదృష్టమని పూర్వజన్మ సుకృతమని నాయకులు
గడ్డం ప్రశాంత్ కుమార్ అన్నారు.
ఈనెల 22న అయోధ్యలో రాముని యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్,
కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్,
గడ్డం ప్రశాంత్ కుమార్, స్వర్గం వెంకట్ నారాయణ రామచంద్రం ,రమేష్ గౌడ్, దుర్గి శివ, గడ్డం వెంకటేష్, మోహన్ గౌడ్, బాలేష్, పోతురాజు నాగరాజ్,మహిళలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు , రామభక్తులు
తదితరులు పాల్గొన్నారు.
