రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,కలెక్టర్ బదావత్ సంతోష్ కలిసి గూడెం నీటి విడుదల

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 06 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గుడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సాగు నీరు అందిస్తున్నామని,నీటిని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కలిసి కలెక్టర్ బాధవత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం దండేపల్లి మండలం తానిమడుగు గ్రామం వద్ద 30 వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ నుంచి హజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ వరకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నీటిని విడుదల చేశారు.అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…15 వేల పై చిలుకు ఎకరాలకు రెండు టీఎంసీల నీటిని ఇస్తున్నామ్మన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నందున ఆరు తడి పంటలు వేసుకుంటే బాగుంటుందని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడ్డం నాగమణి త్రిమూర్తి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్,ముత్తే రాజన్న,తోట మోహన్,వనపర్తి మల్లిక-రవి, మండల అధ్యక్షుడులు అక్కల వెంకటేశ్వర్లు,పింగిలి రమేష్,నాయకులు ముద్ధసాని వేణు,ముత్తె వేంకటేష్,అప్పని సత్తయ్య, అక్కల సత్యయ్య,రాందేని వెంకటేష్,సర్పంచులు ఎమ్మార్వో సంధ్యారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విటల్,అధికారులు,రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking