ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 31 : కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 25 మంది మహిళలకు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చీరలను పంపిణీ చేశారు.అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పీఎస్ఆర్ బతుకమ్మ కానుకగా శుక్రవారం నుండి మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం తాల్లపేట గ్రామం నుండి చీరల పంపిణి ప్రారంభమవుతుందని మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు ఒక లక్ష చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సురేఖ తెలిపారు.గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ,ఏఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సురేఖ మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు కు ఒక్క అక్క చెల్లి లాగాపసుపు కుంకుమ చీరలను నియోజకవర్గంలోని మహిళలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని గుర్తుచేశారు.కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకుందన్నారు.రాజస్థాన్ రాష్టంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకేదక్కుతుందన్నారు.రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో చేసిందని గుర్తుచేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఎద్దేవాచేశారు.కేవలం ఏవో హామీలను ప్రజలకు చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను,ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం,డబుల్ బెడ్ రూమ్,దళితులకు, గిరిజనులకు మూడెకల భూమి,నీళ్లు,నిధులు నియామకాలు అని చెప్పి అధికారంలో వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక్క హామీలను నెరవేర్చలేదని అన్నారు.మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందన్నారు.మిషన్ భగీరథ ద్వారా కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజలకు మంచి నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మంచిర్యాలకు ప్రతి ఏడాది ప్రజలకు కన్నీళ్లకు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.వరదల్లో మునిగిన వారికి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా నష్ట పరిహారం అందజేయలేదని అన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతి చేస్తూ దోపిడీ చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేసిందేమిలేదని ఆమె అన్నారు .ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో బిసి బంధు ,మైనార్టీ బంధు ,గృహ లక్ష్మి అనే పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షలు రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేయడం జరుగుతుందన్నారు.మహిళకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,ఉపాధి హామీ పథకం కార్డు ఉన్నవారికి నెలకు 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని,రైతు బంధు 12000 రూపాయలకు పెంచుతామన్నారు.ఇల్లు లేనివారికి 5 లక్షల రూపాయలు,దళిత గిరిజన కుటుంబాలకు ఇంటి నిర్మాణం కొరకు 6 లక్షలు రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇచ్చిందో,కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కచ్చితమైన హామీలతో కూడిన గ్యారంటీ కార్డు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపున హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీద్ ,బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి,మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఖాలీద్,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం,మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత,వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య,మాజీ కౌన్సిలర్ గాండ్ల సతమ్మ, సింగరేణి విశ్రాంత కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.