రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 సెప్టెంబర్ 2023: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన గజానన రూపాలను పూజించడం వలన పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందనీ, పర్యవసానంగా ప్రజలు అస్వస్థకు గురై అనారోగ్యంకు గురవుతారని అందువలన ప్రతీ ఒక్కరు మట్టి గజానన విగ్రహాలను మాత్రమే పూజించాలని మణికొండ పురపాలక సంఘం పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేస్తూ హెచ్.ఎమ్.డీ.ఏ వారి సౌజన్యంతో ఇకో ఫ్రెండ్లీ మట్టి గణపతులను స్థానిక అలకాపురి నివాసిత ప్రజలకు పంపిణీ చేయడం జరిగినదనీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వి.బాల్ రెడ్డి, తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ స్వామి, కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, P.శ్రీధర్, దిలీప్, శ్యామ్, రాజశేఖర్ రెడ్డి, K.శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, మని, ధీరజ్, D.శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రావు, చిరంజీత్ మరియు కాలని వాసులు పాల్గొన్నారనీ ఈ సందర్భముగా తెలంగాణ ప్రభుత్వ హెచ్.ఎమ్.డీ.ఏ అధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.