ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13 :
మందమరి పట్టణానికి చెందిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సందెల మహిర పుట్టినరోజు సందర్భంగా వారి తల్లితండ్రుల సహకారంతో మందమర్రి మండలం పొన్నారం హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పంపిణీ చేశారు. అనంతరం వ్యవస్థాపన అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ 10 వ తరగతిలో మంచి మార్కులతో సాధించాలని ఆశిస్తున్నానన్నారు. పదవ తరగతి పరీక్షలు విజయానికి తొలిమెట్టు కావున
పిల్లలందరూ సాధించాలని కోరారు.
అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన సందెల మహీర కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభు దేవ్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు నంది పాటరాజు, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, దాడి రాజు,ఎండీ జావిద్ పాషా ,రవీందర్, నాగరాజు, చరణ్ లు పాల్గొన్నారు.