*రోడ్లపై గుమి గుడుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన,
*పరిచయంలేని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లిన, గొడవలు సృష్టించిన కఠిన చర్యలు తప్పవు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి-13 (ప్రజాబలం ప్రతినిధి)
హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో , సురక్షితంగా జరుపుకోవాలని రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం,పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం,బలవంతంగా రంగులు చల్లిన, గొడవలు సృష్టించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ…
హోలీ వేడుకల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని.యువకులు అత్యుత్సాహం ప్రదర్శింస్తూ ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన , చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.హోలీ వేడుకలు ముగిసిన తరువాత స్నానాల కోసం అదిక నీటి ప్రవాహం,లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు అని సూచించారు.పండుగ వేళ ఇతరులపై బలవంతంగా రంగులు వేసిన,గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా,ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని,తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి విజ్ఞప్తి చేసినారు.