డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం పంచుతదా?

 

-లేకుంటే పేదలతో గృహప్రవేశం చేయించమంటారా?

-సిపిఎం రాష్ట్ర నాయకుల డిమాండ్

ప్రజా బలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13 :

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం పాల చెట్టు వద్ద గల డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలకు ప్రభుత్వం పంచకుంటే, సిపియం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లులేని నిరుపేదలతో గృహప్రవేశం చేయిస్తామని పైళ్ళ ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు,సంకె రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి తెలియజేశారు. గురువారం సిపియం మందమర్రి మండల కమిటీ ఆధ్వర్యంలో పాలచెట్టు ప్రాంతంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, సంకె రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిందన్నారు. మందమర్రి ఏరియాలోని పాలచెట్టు ప్రాంతంలో కోట్లాది రూపాయలతో దాదాపు 500 వరకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిందని,. సర్వేల పేరుతో సంవత్సరాలు గదిపింది కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నిరోజులు ఒక్కరికి కూడ ఇళ్ళు ఇవ్వలేదన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదలకు పంచడంలో చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి, నేడు ఎవ్వరికి ఇవ్వకపోవడంతో మొత్తం పిచ్చి మొక్కలతో, గోడలు బీటలు వారి, కీటికిల అద్దలు పగిలి, పందులు, కుక్కలకు అవసాలుగా అంతేకాకుండా మందుబాబులకు, పేకాటరాయులకు ఇతర అసాంఘిక కార్యకారపాలకు అడ్డగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మారుతున్నాయన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం తమ గౌరవాన్ని నిలుపుకునే విధంగా అర్హులైన పేదలందరికీ పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంచాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో ఇండ్లు లేని నిరుపేదలందరితో గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, ఎర్మ పున్నం, బోడెంకి చందు, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, గోమాస అశోక్, దుంపల రంజిత్ కుమార్, సామల ఉమారాణి, దాగం శ్రీకాంత్, భాగ్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking