-మున్సిపల్ కమిషనర్ వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13 :
మందమర్రి పట్టణంలో దహన సంస్కారంమునకు తీసుకెళ్లే వైకుంఠ రథం లో భగవద్గీత రికార్డు వేయడం ఆపివేలను కోరుతూ బిజెపి పట్టణ నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ తుంగపిండి రాజలింగును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ వైకుంఠ రథం వాహనంలో శివయాత్ర జరిగే సమయంలో భగవద్గీత రికార్డు వేస్తున్నారని దాని వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని దానిని వెంటనే ఆపి వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్త కుమారస్వామి, రాష్ట్ర నాయకులు రామటెంకి దుర్గరాజు, పట్టణ కన్వీనర్ కోలోటి శివ లు పాల్గొన్నారు.