-పట్టణ ఎస్సై శివనీతి రాజశేఖర్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13 :
హోళీ పండుగను ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని మందమర్రి పట్టణ ఎస్సై శివనీతి రాజశేఖర్ తెలిపారు. హోలీ పేరుతో రోడ్డు మీద వెళ్లే సంబంధంలేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని కూడా సూచించారు. మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
పండుగ రోజున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.