ఖమ్మం మార్చి 13 (ప్రజాబలం బ్యూరో) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు పతాని కృష్ణయ్య మాట్లాడుతూ తాటిపూడి గ్రామం వైరా మండలం. నేను సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది T G E W I D C శాఖలో సైట్ ఇంజనీర్ గా 23 సంవత్సరములు సంతృప్తికరంగా సేవలు అందించి యున్నాను . 2017 సంవత్సరంలో నేను SSA నుండి తెలంగాణ విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ లో విలీనం అయిన తర్వాత వారి మాతృశాఖ వారు జీతాలు తీసుకొని మాకు ఇవ్వలేదు . ప్రస్తుత కలెక్టర్ అనుమతి ఉన్నప్పటికీ నన్ను ఉద్యోగంలోనికి తీసుకొనకుండా బకాయి జీతాలు ఇవ్వకుండా తీవ్ర మానసిక వేదనకు తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి. విన్సెంట్ రావు మానసికంగా గురి చేశారు . వైరా శాసనసభ్యులు వారి లెటర్ తెచ్చినప్పటికిని పై అధికారి స్పందించలేదు . పైగా నాపై లేనిపోని సాడీలు సంస్థ ఎండికి ఈ చెప్పారు . దాంతో సంస్థ ఎండి నన్ను వ్యక్తిగత దూషణ చేసేలా దోహదపడ్డారు . నాకు ఉద్యోగము మరియు పెండింగ్ బకాయిలు ఇస్తానని నమ్మించి నా ఆర్టిఐ దరఖాస్తును విర మింపజేసి , నాకు ఉద్యోగము మరియు బకాయలు ఇవ్వకుండా మోసం చేశారు . కనుక నా ఉద్యోగము మరియు నా బకాయిలు ఇప్పించి నన్ను ఆదుకోవాలని కోరారు