శ్రీ రామ నవమి సందర్భంగా వీఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారిచే పానకం, వడపప్పు ప్రసాద వితరణ:

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 17 ఏప్రిల్ 2024:
అయోద్యాపురిలొనీ దివ్య సుందర మందిర ప్రాంగణంలో తొలిసారి భక్తకోటి పక్షపాతి దివ్య తేజో స్వరూప ధర్మ రక్షకుడు శ్రీ సీతారాముని వసంత నవమి మహోత్సవాల శుభ సందర్భంగా అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వీఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారి ఆధ్వర్యములో మణికొండ పైప్ లైన్ రోడ్డులో గల బస్ స్టాండ్ లేబర్ అడ్డా సమీపాన 17 ఎప్రిల్ బుదవారం రోజున ఉదయం 10 గంటలకు సామూహిక పూజానంతరం, రామ నామ కీర్తనలతో, భజన పాటలతో విచ్చేసిన అతిథులకు, పుర ప్రముఖులకు, రహదారి బాటసారులకు, కార్యక్రమంలో పాల్గొన్న భక్త జనులందరికీ సుగంధ భరిత చందన తిరు నామ తిలక ధారణతో బాటు భగవత్ ప్రీతి పాత్రమైన పానకం మరియు శ్రీరామ చంద్రుల ఇష్ట నైవేద్యమైన వడపప్పు ప్రసాదమును దాదాపు 400 మందికి వితరణ గావించడ మైనదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలిపినారు, ఇట్టి భక్తి కార్య క్రమంలో ట్రస్ట్ కోశాదికారి దిలీప్ కక్కడ్, ట్రస్ట్ సభ్యులు ఉపెందర్నాధ్ రెడ్డి, మోహన్ కుమార్ ఫానిగ్రహి, టీ.రాజశేఖర్, కార్యాచరణ ఏర్పాట్లలో తోడ్పడిన మేడ్కేర్ డయాగ్నొస్టిక్ కాశీరామ్, విజయ్, మణికొండ పురజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని శుభ ఘడియలను సద్వినియోగ పరచుకొని తీర్థ ప్రసాదములు గైకొన్నారని తెలుపడమైనది.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking