భారీ వర్షాలు.. వణికిపోతున్న గల్ఫ్ దేశాలు…

 

గల్ఫ్ దేశాలను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఒమన్ వరదల ధాటికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు భవనాలు ధ్వంసం కాగా రోడ్లు జలమయం అయ్యాయి. దుబాయ్ లోనూ ఇదే పరిస్థితి. ఈదురు గాలులకు కుర్చీలు, టేబుళ్లు సైతం ఎగిరిపోతుండగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు. వరదధాటికి ఎయిర్పోర్టు నీటమునగడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కుమ్మరించాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking