కొర్విచెల్మ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 17 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు.హనుమాన్ మాలా స్వాములతో గ్రామ ప్రజలు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఉదయం హనుమాన్ మాలా స్వాములు పాలకొరక కార్యక్రమం సీతారాముల వారి,దొంగ మల్లన్న స్వామి,పోచమ్మ తల్లికి, హనుమాన్ గుడి వద్ద,పాల పొరక కార్యక్రమం వేయడం జరిగింది.శ్రీ సీతారాముల తలంబ్రాలు,వస్త్రాలు, మంగళ సూత్రాలు,మల్యాల భాగ్యలక్ష్మి-చంద్రమౌళి,గొపతి కవిత-తిరుపతి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, హనుమాన్ మాలా స్వాములు తో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సీతారాముల గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలా స్వాములు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking