విత్తన షాప్ లను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఇ సురేఖ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 31 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లోని విత్తనాల డీలర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి ఇ. సురేఖ తనిఖీ చేయడం జరిగింది. శుక్రవారం రోజున లక్షెట్టిపేట డీలర్లు షాప్ లో నందు తనిఖీ లో స్టాక్ రిజిస్టర్,బిల్ బుక్స్,రైతు వారి విత్తన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ…రైతులకు తప్పని సరిగా బిల్స్ ఇవ్వాలని,విత్తనాలు ఎమ్ ఆర్ పి కి మించి అమ్మరాదు,అన్ని రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది.ఈ తనిఖీ లో డీ. ఎ.ఓ వెంట లక్షెట్టిపేట మండల వ్యవసాయ అధికారి సి ఎచ్ ప్రభాకర్,పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking