ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 31:
కీసర మండలం భోగారం గ్రామం లోని హోలీ మేరీ కళాశాల లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ లైన మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి,ఉప్పల్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను పార్లమెంటు నియోజకవర్గం జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్, కుషాయి గూడ. ఏ సి పి మహేష్ గౌడ్ ,అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి తో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పూర్తి అయిన ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన చోట్ల పలు సూచనలు సలహాలు తెలియజేశారు.ప్రతి కౌంటింగ్ సెంటర్లో సి సి కెమెరా,బారి కేడింగ్, కరెంటు ఇంటర్నెట్, మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు.చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డి ఓ ఉపేందర్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారి రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు