సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆస్రా కాలనీ, శాంతినగర్ లో విస్తృతంగా పర్యటించి డ్రై డే కార్యక్రమ అమలు తీరును పరిశీలించి,వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలలో ఆమె ఆయిల్ బాల్స్ ను వేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలనీ ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, తమ ఇంటి పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలని అన్నారు. రహదారులు,ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా వెంటవెంటనే తోలగించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటిపరిసరాలలో కూలర్లు,నీటి తొట్టెలు, టైర్స్ వంటి వాటిలో నీరు నిలువకుండా శుభ్రం చేసుకోవాలని అన్నారు.పరిసరాల పరిశుభ్రత, అంటూ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న డ్రై డే కార్యక్రమాన్ని పంచాయతీ, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఈశ్వర్,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.ధనరాజ్,మెప్మ పిడి సుభాష్, మున్సిపల్ డీఈ సంతోష్, వైద్యులు రాజేందర్,రవీందర్ రెడ్డి,శ్రీనివాస్,మాస్ మీడియా అధికారి రవీందర్,స్థానిక కౌన్సిలర్లు, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking