డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం నుండి విగ్రహావిష్కరణకు వెళ్తున్న ప్రజలకు రవాణా సౌకర్యం, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు, పార్కింగ్ తదితర అంశాలపై రెవిన్యూ, పంచాయతీరాజ్, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ సమన్వయం. చేసుకుంటూ క్షేమంగా వెళ్లి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భారతరాజ్యాంగ నిర్మాత 125 అడుగుల విగ్రహాం ఆవిష్కరణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిందని చాలా సంతోషమని చెప్పారు. నియోజకవర్గానికి 6 బస్సులను ఏర్పాటు చేశామని, ప్రతి బస్సు బయలుదేరినప్పటి నుండి సభా ప్రాంగణానికి చేరు వరకు, అలాగే తిరిగి కార్యస్థానాలకు వచ్చే వరకు యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా ఎక్కడ ఉన్నామో లైవ్ లొకేషన్ తెలుస్తుందని లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన చెప్పారు. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మన జిల్లా తరుపున పెద్ద సంఖ్యలో తరలి వెళ్తునందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నార్కెట్పల్లిలో మధ్యాహ్న, రాత్రి బోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భోజన ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇద్దరు జిల్లా అధికారులను, ఇద్దరు తహసిల్దారులను నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నందున ఎల్బీ నగర్ నుండి పారడైజ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని చెప్పారు. సభాప్రాంగణంలో ఏ జిల్లాకు ఆ జిల్లా సీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మన జిల్లాకు కేటాయించిన స్థలంలో ఉండాలని చెప్పారు. పార్కింగ్కు నిర్దేశించిన ప్రాంతంలో వాహనాలు నిలుపుదల చేయాలని చెప్పారు. ఉదయం 4 గంటలకే అన్ని బస్సులు బయలుదేరాలని చెప్పారు. తహసిల్దారులు వెళ్తున్నవారిక గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పారు. బోజన సమయంలో రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బస్సులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు, మజ్జిగతో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. బస్సులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రామ్మూర్తికి, డిఆర్డీ అశోకచక్రవర్తి పర్యవేక్షణకు నియమించినట్లు చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సీతారం, అన్ని మండలాల తహసిల్దార్లు, యంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.