సంగారెడ్డి, ఏప్రిల్ 13 ప్రజ బలం ప్రతినిది:
ఈనెల 14న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం నాడు ఒక ప్రకటనలో కోరారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 14న పాత బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 9,:00 గంటలకు పుష్పమాలంకరణ గావించి, అనంతర అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధి కారులు, వివిధ సంఘాల నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఇట్టి జయంతోత్సవంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు ,ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.