వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత అధికారులకు ఆదేశించిన …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ఏప్రిల్ 13 ప్రజ బలం ప్రతినిది:
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, (ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ ల) తో ఎన్నికల జాబితా, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఓటరు జాబితా నుండి తొలగించిన వాటిని పునఃపరిశీలించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ స్టేషన్ వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలనిసూచించారు.
మృతి చెందిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే విషయంలోనూ ఒకటికి రెండుసార్లు వివరాలను సరి చూసుకోవాలని తెలిపారు. తొలగించిన ప్రతి ఓటరు పేరుకు సంబంధించి స్పష్టమైన కారణాలు, ఆధారాలను పొందుపర్చాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరుపకుండా, రికార్డులను ధృవీకరించుకోకుండా జాబితా నుండి ఓటర్ల పేర్లు తొలగించకూడదని స్పష్టం చేశారు.
ఓటరు జాబితాలో తమ పేరునుతొలగించారని
అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓలు నగేష్, రమేష్ బాబు, అంబాదాస్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సూపరిందెంట్ మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.