ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చీమలపాడు లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముగ్గురు గిరిజనులు చనిపోయి ఐదుగురు క్షతగాత్రులయ్యారు చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని క్షతగాత్రులకు 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసును ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న బీఎస్పీ కార్యకర్తలు జిల్లా నాయకులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన కార్యకర్తలను వేషరతుగా వెంటనే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు
బిఆర్ఎస్ పార్టీ మరొకసారి మాకు పట్టాభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశం తోటి ఆ ఆత్మీయ సమ్మేళనాలను పెట్టి అమాయకులైన ఫూటకు గడవని పేదల ప్రాణాలను తీసి చాలామందిని క్షతగాత్రులను చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రి పువాడ అజయ్జకుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్ తదితర బాధ్యులైనటువంటి బిఆర్ఎస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి బాధితులకు తక్షణమే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి క్షతగాత్రులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వారికి న్యాయం జరిగే వరకూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా దశల వారి గా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది బాధితులకు బిఎస్పి అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తుందని డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడుఉపేంద్ర సాహూ. జిల్లా ఇన్చార్జిలు ఫిసీ వీరస్వామి. మేకతోటి పుల్లయ్య మహిళా కన్వీనర్ ఉప్పల మంజుల చెరుకుపల్లి నాగేశ్వరరావు మిర్యాల నాగరాజ్ బచ్చలకూరి శ్రీకాంత్ పాలె పొంగు విజయ్ కుమార్ బుర్ర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు