ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

ఫుడ్ పాయిజన్ తో స్థానిక నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సాపూర్ (జి) కేజీబీవీ విద్యార్థులను గురువారం ఆయన పరిశీలించి వైద్యులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన 26 మంది విద్యార్థులకు అత్యవసర వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించడం జరిగిందని, తల్లిదండ్రులెవరు ఆందోళన చెందవద్దని అన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపిస్తామని, బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, వైద్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking