పోలిక్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా ఎన్నికల అధికారి వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 4 (ప్రజాబలం) ఖమ్మం పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి కల్లూరు మండలంలోని హనుమతాండ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కవాలివాడ లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, పేరువంచ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముగ్గు వెంకటాపురం లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలను సందర్శించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, రన్నింగ్ వాటర్ తో టాయిలెట్ తదితర అన్ని మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల పాఠశాలలకు కాంపౌండ్ వాల్/ ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటుకు, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు అవసరం ఉన్నచోట పెంపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకే లోకేషన్ లో ఒకటికి మించి ఎక్కువ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నచోట, క్యూ రద్దీ, భద్రతా సమస్యలు తలెత్తకుండా వేర్వేరు బ్లాకులో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఫ్యాన్లు, లైట్లు వుండేలా, కేంద్రం వెలుపల వెలుతురు వుండేలా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లకు, పోలింగ్ సిబ్బంది కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ పి. మౌనిక, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, కల్లూరు మండల తహసీల్దార్ సాంబశివుడు, ఎంపిడివో చంద్రశేఖర్, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking