ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 4 (ప్రజాబలం) ఖమ్మం చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తణిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్, పోలీసు కమీషనర్ సునీల్ దత్ తో కలిసి కల్లూరు మండలం పేరువంచ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ (తెలంగాణ-ఏపీ సరిహద్దు) చెక్‌పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. నగదు, మద్యం రవాణా నియంత్రించాలన్నారు. సిసి కెమెరా ల ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ సంబంధించి రిజిస్టర్‌ను నిర్వహించాలన్నారు. చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీ కి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అప్రమత్తంగా వుంటూ, 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ పి. మౌనిక, అదనపు డిసిపి ప్రసాద్ రావు, ఏసీపీ రఘు, కల్లూరు మండల తహశీల్దారు సాంబశివుడు, ఎంపిడివో చంద్రశేఖర్ అధికారులు, తదితరులు ఉన్నారు.