పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ను పారదర్శకంగా రూపొందించాడానికి అన్ని చర్యలు తీస్కుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు.

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా సెప్టెంబర్ 19 :

పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ను పారదర్శకంగా రూపొందించాడానికి అన్ని చర్యలు తీస్కుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు అడిషనల్ కలెక్టర్ ఇంచార్జీ సంపత్ రావు తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందింస్తామని అన్నారు.

ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 13న ముసయిదా ప్రచురించడం జరిగింది అని అన్నారు.
వార్డుల వారీ జాబితాపై సెప్టెంబర్‌ 13 నుంచి 21వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అన్నారు.19 తేదీన మండల స్థాయిలో ఎంపీడీఓ ల ఆధ్వర్యంలో రాజకీయ రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని,సెప్టెంబర్‌ 28న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించడం జరుగుతుంది అని అన్నారు.కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం, వార్డులో ఉండే విధంగా చేపట్టిన (ఓటరు మెర్జింగ్) ప్రక్రియను తో పాటు మ్యాపింగ్ ప్రక్రియ ను నూరు శాతం పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఓటరు జాభితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, ఓటరు జాబితా తయారులో అబ్యంతరాలు, పిర్యాదులను సత్వరమే పరిస్కారం చూపాలి అని అన్నారు.

జిల్లాలో 9 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతిల పరిధిలో 1556 వార్డులున్నట్లు తెలిపారు. ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు.

ఈ సమావేశంలో డి పి ఓ దేవ్ రాజ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking