ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్ష కేంద్రం నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నీటి వసతిని తనిఖీ చేశారు పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.మాస్ కాపీయింగ్ నిరోధించడానికి ప్రత్యేక స్వ్కాడ్ టీమ్లు, అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షల నిర్వహణ విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరం10200, ద్వితీయ సంవత్సరం 9277 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. అలాగే ఫ్లయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్వ్కాడ్, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్ష కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking