మన ఊరు మనబడి పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

వివిధ పాఠశాల ల్లో చేపట్టిన పనులు మార్చి 31 లోపు అన్ని హంగులతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి ఫిబ్రవరి 25 ప్రజ బలం ప్రతినిధి:
శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యా, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు మనబడి పనుల పురోగతిని,ఎఫ్ టి ఓ ల అప్ లోడ్ తదితరాలపై మండలం వారీగా, ఏ ఈ వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు లక్ష్యం మేరకు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడరాదన్నారు.
ఆయా శాఖల ఈ ఈ లు ఎప్పటికప్పుడు డి ఈ లు,ఏ ఈ లతో పనుల పురోగతిపై సమీక్షించాలని తెలిపారు.కొన్ని మండలాల్లో పనుల పురోగతి నిర్దేశించిన లక్ష్యము మేరకు లేకపోవడం పై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మన ఊరు మన బడిలో చేపట్టిన పనులు పూర్తి చేయడంలో అశ్రద్ద వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పనులు బాగా చేస్తున్న ఏ ఈ,డి ఈ లను కలెక్టర్ అభినందించారు. మిగిలిన
ఏ ఈ లు తమ పనులు వేగవంతంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పూర్తి చేయాలని సూచించారు.పూర్తయిన పనులకు సంబంధించి వెంట వెంటనే ఎఫ్ టి ఓ లను అప్ లోడ్ చేయాలని సూచించారు.
మార్చి 31 లోపు మన ఊరు మన బడిలో చేపట్టిన పాఠ శాలల పనులన్నీ ఈజీఎస్ పనులతో సహా పూర్తి చేయాలని తెలిపారు.
పాఠశాలలకు వేస్తున్న పెయింటింగ్ క్వాలిటీ బాగుండాలని,పూర్తయిన పాఠశాలలకు వెంట వెంటనే పెయింటింగ్ పూర్తి చేయాలని పెయింటింగ్ ఏజెన్సీలకు సూచించారు.
అదేవిధంగా త్వరితగతిన డ్యూయల్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, చాక్ బోర్డులు ఫిట్ చేయాలని సంబంధిత సప్లైంగ్ కాంట్రాక్టర్లకు సూచించారు. పనుల విషయమై ఎం ఈ ఓ లు కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు.
ఆయా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ కు సూచించారు.
ఈ సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి రాజేష్, ఇంజనీరింగ్ శాఖల ఈ ఈ లు,డి ఈ లు, ఏ ఈ లు, పెయింటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు,డ్యూయల్ డెస్క్ ల సప్లైయర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking