ఇండ్ల పట్టాలను అందజేసిన ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి

మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25
ఇండ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58,59 జీవో పేద ప్రజలకు వరంగా మారిందన్నారు ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి.. తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ కు చెందిన ముగ్గురికి అలాగే మున్సిపాలిటీలోని అల్లాపూర్ కు చెందిన ముగ్గురికి, గీత రెడ్డి కాలనీలో ఒకరికి, క్రమబద్ధీకరణ ఇండ్ల పట్టాలను ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిలతో కలిసి తూప్రాన్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత కొన్ని ఏండ్ల క్రితం ఇండ్లు కట్టుకొని నివాసముంటున్నప్పటికీ ఎలాంటి పత్రాలు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అలాంటి వారికి నేడు సీఎం కేసీఆర్ చొరవతో పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జ్ఞాన జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ రవీందర్ రెడ్డి,brs మున్సిపల్ అధ్యక్షుడు సతీష్ చారి, brs మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, నాయకులు కుమ్మరి రఘుపతి, చక్రవర్తి, కృష్ణారెడ్డి, మామిండ్ల కృష్ణ, బొల్లు వెంకట్ ఉమర్, అనిల్, కుమ్మరి రమేష్, మన్నె నవీన్, జిన్న రాజు, ధరావత్ శీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking