మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
జిల్లాలో పనులు ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి తో కలిసి మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి నాటికి పూర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడత కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఈ విషయంలో ఇప్పటికే ఎంతో ఆలస్యం జరిగిందని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 176 పాఠశాలలను మన ఊరు – మన బడి కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో పనుల పురోగతిపై మండలాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం పనులు పూర్తి కాలేదని ఈ విషయంలో అధికారుల అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు. పనులు జరుతున్న వివరాలను ఎప్పకటిప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధుల కొరతలేదని పర్యవేక్షణ లోపంతోనే ఆలస్యం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంపై ప్రతి శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పురోగతి తెలుసుకొంటామని అధికారులు సమన్వయంతో పని చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అలాగైతేనే పనులు త్వరగా పూర్తవుతాయని ఈ విషయంలో వేగవంతంగా పనులు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంమోహన్రావు, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు,ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.