రంజాన్ లో సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్క కలాంగుణం సొసైటీ వినతి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు పరిసరాలలోని మండల గ్రామీణ ప్రాంతాలలో కూడా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురువారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని న్ని సమర్పించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నెలరోజుల పాటు కత్వరా ఉపవాస దీక్షలను పాటించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని వారు నివసించే వీధులు ఆవాసాలలో పారిశుద్ధ్యము త్రాగునీటి విద్యుత్ దీపాల తో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేలా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి ఏడాది మాదిరి ఏడు కూడా వినతిపాత్రాన్ని సమర్పించడం జరిగిందని ఆ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, వ్యవస్థాపకులు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లిం సోదరుల ఆవాసాలలో తగిన విధంగా సౌకర్యాలను కల్పిస్తూ ప్రార్థన ఆలయ వద్ద పారిశుద్ధ్యము తాగునీటి ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మొహమ్మద్ బిన్ అలీ, షేక్ ఇంతియాజ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, మొహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్ షేక్ షకీల్, మహమ్మద్ ఇంతియాజ్, మహమ్మద్ మసూద్ ఖాన్, మొహమ్మద్ ఇస్మాయిల్.

Leave A Reply

Your email address will not be published.

Breaking