అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 29 (ప్రజాబలం) ఖమ్మం కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పెండింగ్ కోర్టు కేసులపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి టైం బాండ్ కేసులు, డైరెక్షన్స్, ధిక్కార, రిట్ పిటిషన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. రిట్ పిటిషన్లపై సరైన కౌంటర్లు ఫైల్ చేయాలన్నారు. ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. టైం బాండ్ కేసులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, డైరెక్షన్ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసుల పరిష్కారం పై వారం వారం సమీక్ష చేయనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో డిపివో హరికిషన్, డిఇఓ సోమశేఖరశర్మ, మత్స్య శాఖ ఏడి ఆంజనేయ స్వామి, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.