ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి 29: ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంకల్పించిన విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు బిజెపి శ్రేణుల తో పాటు ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జరుగుతున్న విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 37 డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా కోరుతు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా (ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్) మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపిద్దాం అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంకల్పించిన విజయ సంకల్ప యాత్ర “కాకతీయ భద్రకాళి- క్లస్టర్” 25న భద్రాచలంలో ప్రారంభమై మార్చ్ 1
సాయంత్రం 6 గంటలకు వరంగల్ జిల్లా లో ప్రవేశించ నుందని ఈ తెలంగాణ బిజెపి విజయ సంకల్పయాత్రకు ముఖ్య అతిథులుగా “ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి” పాల్గొంటారనీ,అర్ టి ఒ జంక్షన్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి స్వాగతం పలుకుతూ మహంకాళి టెంపుల్ ,బొమ్మల గుడి ,శాఖరాశి కుంట, ఇసుక అడ్డా,శివనగర్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్, లోసాయంత్రం 7 గం జరిగే బహిరంగ సభ జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని బిజెపి శ్రేణులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జిలకర వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లిగంటి నర్సింగ్గం,ఆంజనేయులు ,భాస్కర రావు పాల్గొన్నారు.