మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తు నిరోధకం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 29 : మత్తు పదార్థాలు,మధ్య పానియాల వినియోగం యువత భవిష్యత్తుకు నిరోధకమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి సి సుబ్బరాయుడు,అబ్కారీ, మద్యపాన నిషేధ శాఖ పర్యవేక్షకులు నందగోపాల్,డ్రగ్ ఇన్స్ పెక్టర్ లు మత్తు పదార్థాల నియంత్రణపై తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…యువత మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల రవాణా,విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని,జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ,అటవీ,రెవెన్యూశాఖ ల అధికారులు సమన్వయంతో పరీక్షించాలని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల సాగుపై మాదర ద్రవ్యాల చట్టం 1985 ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని,మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసే వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష ,రెండు లక్షల రూపాయల జరిమానా అవసరం అయితే మరణశిక్ష కూడా దీవించడం జరుగుతుందని తెలిపారు.మత్తు పదార్థాల వినియోగం వలన కలిగి నష్టాలపై పాఠశాలకు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం,విక్రయం పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా మత్తు పదార్థాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి తగ్గుముఖం పట్టేలా సమన్వయంతో పనిచేయాలని, పట్టణ ప్రాంతాలు,కాలనీలు, పాఠశాలలు,హోటళ్ళు,విక్రయ ప్రాంతాలపై నీకు ఏర్పాటు చేయడం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన,ప్రభుత్వ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking