ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 9 (ప్రజాబలం) ఖమ్మం ఇల్లు పరిసరాలు వీధుల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు శుక్రవారం కలెక్టర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎఫ్సిఐ రోడ్, సారధినగర్ లలో పర్యటించి, పరిశుభ్రత, డ్రై డే లపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సానిటేషన్, తడి, పొడి చెత్త సేకరణ పనులను తనిఖీ చేశారు. స్ధానికంగా తిరుగుతూ, ప్రజలతో మాట్లాడి వారి స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరం నుంచి తడి, పొడి చెత్త సేకరించే ట్రాక్టర్లు, ఆటోలు తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తని వేరువేరుగా ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. త్రాగునీటి సరఫరా క్రమంగా వస్తుందా, శానిటేషన్ సిబ్బంది రోజూ చెత్త సేకరణ చేస్తున్నారా, ఆంగన్‌వాడీ కేంద్రం మంచిగా సడుస్తుందా, ఆశా సిబ్బంది వైద్య సమస్యలు ఉంటే పట్టించుకుంటున్నారా అని స్ధానికులను కలెక్టర్ ఆరా తీసారు. పరిసరాలు పరిశుభ్రతతో మెలిగితే వ్యాధుల బారి నుండి రక్షించుకోగల్గుతామనిఅన్నారు.
వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోకపోతే విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాల్లో సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, వైద్యులు ఉన్నట్లు, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచుకోవాలన్నారు. రోడ్ల పై నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ మూసుకుపోవడం, పిచ్చి మొక్కలతో దోమలు వృద్ధి చెందుతాయని, వీటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే, దోమలను నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. మన ఇంటి పరిసరాలలో నీరు, మురుగు నిలువ ఉండకుండా చూసుకోవాలని, కాలువల్లో చెత్తాచెదారం వేయవద్దని ఆయన సూచించారు. నగరాన్ని అందంగా ఉంచుతూ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే మున్సిపల్ సిబ్బంది కూడా సరైన ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్ అన్నారు. సానిటేషన్ సిబ్బంది అందిస్తున్న సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్ధానికంగా ఉన్న దుకాణాలు, వృతి వ్యాపారాలు చేస్తున్న వారితో ముచ్చటించి వారి లాభ, నష్టాల గురించి ఆరా తీసారు. కిరాణాషాపు నడుపుతున్న మహిళాతో మాట్లాడి, మీరు గ్రూప్ సమాఖ్యలో ఉంటే ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి తోడ్పాటు నిస్తుందని తెలిపి, మహిళా శక్తి పధకం గురించి ఆయన వివరించారు కలెక్టర్ పర్యటన సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, అధికారులు తదితరులు ఉన్నారు.
.