జూనియర్ కాలేజీలో వన మహోత్సవం,

 

తూప్రాన్ ప్రజాబలం న్యూస్.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటాలని మరియు వాటిని పరిరక్షించాలని, అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని కాలానుగుణంగా వచ్చేటటువంటి వ్యాధుల నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.సీజనల్ వ్యాధులు, డ్రగ్స్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.సీజనల్ వ్యాధుల నివారణ,డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం తరఫున అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే
తూంకుంటనర్సారెడ్డి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి, తహసీల్దారు విజయలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ ఖాజా మొహీనుద్దీన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి, అధ్యాపకులు,సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షురాలు ఆకాంక్ష రెడ్డి, పలువురు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking