జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్ల స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో శుక్రవారం స్థానిక ఎన్నికల సన్నద్ధం పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటిస్తూ సన్నద్ధం కావాలన్నారు.
నూతన వార్డుల ఏర్పాటు, వార్డుల విభజన, జనాభా, లింగ నిష్పత్తి ప్రాతిపదికన రికార్డు చేయాలన్నారు.
రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున , తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంతవరకు గ్రామా ,మండల స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీ ఓలు, ఎంపీడీవోలు, ఆపరేటర్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.