వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి10
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో గృహ జ్యోతి పథకంలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారుల అసంపూర్ణంగా ఉన్న వివరాలు వేగవంతంగా యాప్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.
శనివారం గృహ జ్యోతి పథకంలో భాగంగా స్వీకరించిన దరకాస్తులలో తప్పిన సమాచారాన్ని ప్రజల నుండి సేకరిస్తున్న తీరును వరంగల్ నగరంలోని 33 డివిజన్
శాంతినగర్ లోని
మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ లో,
34 డివిజన్ శివనగర్ లోని కార్మిక సంఘ భవనంలో కలెక్టర్ పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు ఆర్పీ లు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ, ఐకేపీ, తగు సూచనలిచ్చారు.
సమాచారాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం)ఒక్కరోజే గడువు ఇచ్చిన ఇచ్చిన క్రమంలో ఆర్సీ లు, అంగన్వాడీ, ఆశా, మెప్మా సిబ్బంది అధికారులు మండలాల లోని ఆయా కమ్యూనిటీ భవన్ లు, ముఖ్య కూడల్లలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమాచారాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా ఫోన్ల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేస్తున్నట్లు, ప్రజలు సహకరించి అధికారుల నుండి ఫోను రాగానే గ్యాస్ సంబంధిత సమగ్ర సమాచారం అందించి లేదా అట్టి నెంబర్ కు వాట్స్ అప్ ద్వారా గ్యాస్ కన్జ్యూమర్ నంబరు గ్యాస్ కంపెనీ పేరును తెలియజేయాల్సిందిగా కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్ రెడ్డి,, సూపర్వీజింగ్ అధికారి, ఏఈ హాబీబ్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.