రాష్ట్ర బడ్జెట్ పేద మధ్య తరగతికి భరోసా

కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు బొబ్బిళ్ళ పాటి బాబురావు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతికి కుటుంబాలకు భరోసా కల్పించిందని కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు బొబ్బిళ్ళపాటి బాబురావు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆరు గ్యారెంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయించడం పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు అలాగే సాగునీటి రంగానికి, 28,024 కోట్లు, దళితుల సంక్షేమానికి 21 వేల 874 కోట్ల కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఈ బడ్జెట్ కేటాయింపులే కొలమానం అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking