సాగు నీటి సరఫరా పై వ్యవసాయ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

 

మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-

సాగునీరు సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలి.
శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, తో కలిసి మండల వ్యవసాయ అధికారులు మరియు వ్యాసాయ శాస్త్రవేతలతో సాగునీటి వినియోగంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. వరి పంటకు అందుతున్న సాగు నీటి వినియోగ పరిస్థితిని, రిజర్వాయర్ల లోని నీటిమట్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వేసవి ని దృష్టిలో పెట్టుకొని నీరు వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
కాలువలను సందర్శించాలని నీరు వృధా కాకుండా చూడాలన్నారు. నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కలిపించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ సంబంధిత మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking