మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
మహిళా శక్తిని, యుక్తిని చాటిచెప్పేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో
జడ్పీ సీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సీఈఓ ఎల్లయ్య, కార్యాలయ ఉద్యోగులు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జెడ్పి సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించేందుకు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కార్యాలయ ఇతర అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.