గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణలో ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు, అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

జయశంకర్‌  భూపాలపల్లి జిల్లా ప్రజాబలం ప్రతినిధి: బుధవారం ఐడిఓసి కార్యాలయంలో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణపై చీఫ్‌ సూపర్‌ వైజర్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, రూటు అధికారులు, ఐడెంటిఫికేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారని తెలిపారు. మన జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాల్లో 4423 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 6 గంటలకు పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.
17 పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. 17 మంది చీఫ్‌ సూపర్‌ వైజర్లు, 37 మంది బయోమెట్రిక్‌
ఇన్విజిలేటర్లు, ఒక బయోమెట్రిక్‌ సూపర్‌ వైజర్‌ తో పాటు 17 మంది అబ్సర్వర్లును నియమించామని తెలిపారు. ఐదు రూట్లుగా విభజించి 5 మంది రూటు అధికారులను నియమించినట్లు తెలిపారు. కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ ఆత్యంత భద్రత మధ్య పోలీస్‌ ఎస్కార్ట్‌ తో క్లోస్డ్‌ వాహనాలలో తరలించాలని తెలిపారు. 10 మంది దివ్యాన్గ అభ్యర్థులు పరీక్ష కు హాజరవుతున్నారని వారికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులను స్క్రైబ్స్‌ గా నియమించనున్నట్లు తెలిపారు. దివ్యాన్గులకు ప్రత్యేక గదిని కేటాయించాలని, వారికి అదనపు సమయం ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజులు పరీక్ష జరుగుతుందని ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ పరీక్షకు అభ్యర్థులను ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 1.30 నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారని తెలిపారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారని అన్నారు.

అభ్యర్థులను నిశిత పరీక్ష తదుపరి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మహిళల తనిఖీ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించాలని తెలిపారు. జిరాక్స్‌ కేంద్రాలు మూసివేపించాలని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, గుర్తింపు కార్డు లేకపోతే అనుమతి ఉండదని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ఎలాంటి వ్యర్థాలు లేకుండా పరిశుభ్ర చేయాలని మున్సిపల్‌, పంచాయతి అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు.
సురక్షిత మంచినీరు సరఫరా చేయాలన్నారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం ను ఆదేశించారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవాలని సూచించారు. సెల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లాడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. ప్రతి 30 నిమిషాలకు బెల్‌ కొట్టాలని, ముగింపుకు 5 నిమిషాల ముందు వార్నింగ్‌ బెల్‌ కొట్టాలని సూచించారు. పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులను బయటికి పంపొద్దని పేర్కొన్నారు.
అనంతరం ఏర్పాట్లు పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో పరీక్ష జిల్లా నోడల్‌ అధికారి విజయలక్ష్మి, పోలీస్‌ నోడల్‌ అధికారి కిషన్‌, కో ఆర్డినేటర్‌ వెంకన్న, విద్యుత్తు శాఖ ఎస్‌ ఈ మల్చూర్‌, ఆర్డీఓ మంగిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking