జాతీయ లోక్‌ అదాలత్‌ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం చేసుకోవాలి

రాజి మార్గమే రాజా మార్గం అనే నినాదాన్ని మనసులో నాటుకోవాలి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గౌరవనీయులు శ్రీ పి. నారాయణ బాబు గారు అన్నారు.
జయశంకర్‌ భూపాలపల్లి ప్రజాబలం ప్రతినిధి:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్‌ పద్నాలుగవ తారీఖున నిర్వహించబోయే జాతీయ లోక్‌ అదాలత్‌ లో పెద్ద ఎత్తున కేసులను పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గౌరవనీయులు శ్రీ పి. నారాయణ బాబు గారు సూచనలు చేశారు.
జడ్జి గారు మాట్లాడుతూ ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజి మార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజి మార్గమే రాజా మార్గం అని
మనసులో నాటుకోవాలని తెలిపారు, దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని అన్నారు.
చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలిసు స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని జడ్జి గారు అన్నారు. వివిధ కేసుల్లోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి గారు పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking