దోమలో రామ చంద్రా హతవిధీ అని అల్లాడి పోతున్న ప్రజానీకం

గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 11 డిసెంబర్ 2024
రాజేంద్ర నగర్ శాసన సభ పరిధిలోని గండీపేట మండలం మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా పేరు గాంచిన మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ పరిధి మొత్తం స్థానికంగా నివాసం ఉంటున్న పిల్లలు పెద్దలు వృద్దులు దోమల బెడద తీవ్రతతో తమ తమ ఆరోగ్యాలు మొత్తంగా దెబ్బతిని డాక్టరుల చుట్టు తిరుగుతు బతుకు జెట్కా బండి లాగుతున్న పరిస్ఠితిలో దోమలో రామ చంద్రా హతవిధీ అని అల్లాడి పోతుంటే సంబంధిత అధికారులు నిద్రావస్థలో జోగుతూ తమకు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని థి సిటీజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు ఆరోపిస్తూ మణికొండ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఒక మచ్చు తునకగా ప్రజలకు ప్రయోజన కరంగా ఉంటుందని, నిత్యం ఉపయోగించడానికి వీలౌతుందని ప్రజల సొమ్ముతో ఖరీదు చేసిన ఫాగింగ్ మెషిన్ లేదా ఫాగర్ యంత్రాన్ని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టే దశకు చేరుకునేలా కుప్పి తొట్టిలో పడి వేయడం అత్యంత శోచనీయమని, భాధాకరమని ప్రజలు వ్యధ చెందుతున్నారని ఇట్టి యంత్రం రసాయన ద్రావణాన్ని చక్కటి పొగ మంచు స్ప్రేగా ఉపయోగించడానికి వాడే బహుముఖ పరికరం అని, ఇది తెగులు నియంత్రణ కోసం, పెరుగుదలను పరిమితం చేయడం కోసం, వాసన నియంత్రణ కోసం ఉపయోగించ బడుతుందని, ఉపరి తలాలను శుభ్రపరిచే సాధనంగా ఇది బాగా ప్రాచుర్యం పొందిందని, ఇట్టి యంత్రం యొక్క విలువ తెలుసో తెలియకో కాని సంబంధిత అధికారులు అట్టి యంత్రాన్ని ప్రజా సంక్షేమ ప్రయోగానికి ఉపయోగించక గమ్మున కాలం గడపడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రావస్థ నుండి పూర్తిగా మేలుకొని బహుళార్థక ఉపయోగకర పరికరాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడుతూ అధికారులు మెసులుకోవాలని తమ పని తీరును మార్చు కోవాలని ప్రజా ప్రయో జనాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజల మద్దతుతో అందె లక్ష్మణ్ రావు అధికారులను వినమ్ర పూర్వక వినతి గావిస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking