గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 11 డిసెంబర్ 2024
మణికొండ కౌన్సిల్ వార్డ్ 5, వార్డ్ 6, వార్డ్ 17 లకు అతి సమీపాన డ్రైనీజినీ కవర్ చేయడానికి వేసిన సిమెంట్ దిమ్మే విరిగి రోడ్డుతో సహా కృంగి పోవడం ఈ విషయమై ప్రజాధనం వృధా పేరిట పత్రికలలో వచ్చిన శీర్షిక ప్రకారం మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఎటువంటి దుర్ఘటన జరుగక ముందే సిమెంట్ దిమ్మే వేసినందుకు గాను భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు బుద్దోల్ బాబు, అందె లక్ష్మణ్ రావు, షేక్ ఆరీఫ్, శ్రీనివాస్ చారి, రాజు తది తరులు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటూ అట్టి దిమ్మెను బలపర్చడానికి గాను బుద్దోల్ బాబు నీటితో తడుపుతూ కరసేవ చేయడం జరిగినది. తదుపరి బుదవారపు అంగడి రోజున గోల్డెన్ టెంపుల్ కూడలి మొత్తంగా వీధి వ్యాపారులు ఆక్రమించు కోవడం వలన ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్న దృష్ట్యా అధికారులు ఈ విషయమై ప్రజా సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకోవాలని మనవి.