పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిర్వహణకు సిబ్బంది డాటా నమోదు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సిబ్బంది చేపడుతున్న డాటా నమోదు ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 589 గ్రామ పంచాయతీలకు గాను 5398 వార్డులు ఉన్నట్లు, ఇందుకనుగుణంగా వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం, పెద్ద వార్డులు ఉన్న చోట్ల రెండు పోలింగ్ కేంద్రాల ఆవశ్యకత వుండనున్నట్లు ఆయన అన్నారు. ఓటర్ల సంఖ్య నిర్ధారణ అయ్యాక, పోలింగ్ కేంద్రాల సంఖ్య తెలుస్తుందన్నారు. సుమారు 10 వేల మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంటుందని, అందరి డాటా నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డాటా నమోదులో స్కెల్, హోదా, హోమ్ టౌన్, రెసిడెన్స్ టౌన్, అన్ని వివరాలు జాగ్రత్తగా చూడాలని, మండల విద్యాధికారుల నుండి సంతకంతో నివేదిక తీసుకోవాలని ఆయన అన్నారు. డాటా నమోదు పర్యవేక్షణకు అధికారులను నియమించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్ జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు తదితరులు వున్నారు