విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ప్రారంభం

 

*గంగ‌దేవిప‌ల్లిలో అట్ట‌హాసంగా మొద‌లైన వికసిత్ భారత్ కార్య‌క్ర‌మం*

*కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న‌ పైలబ్దిదారుల ప్ర‌సంగం*

ప్రజాబలం ప్రతినిధి వ‌రంగ‌ల్ జిల్లా, డిసంబ‌ర్ 17

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థకాల‌పై క్షేత్ర‌స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఉద్దేశించిన విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర గంగ‌దేవిప‌ల్లిలో శనివారం అట్ట‌హాసంగా ప్రారంభమైంది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాత జాయింట్ సెక్ర‌ట‌రీ హీన ఉస్మాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
జిల్లాలో ఈ నెల 16 నుండి జనవరి 25 వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాత జాయింట్ సెక్ర‌ట‌రీ హీన ఉస్మాన్ అన్నారు.
విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ప్రారంభాన్ని ఉద్దేశించి గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ గా ప్ర‌సంగించారు.
యాత్ర ఉద్దేశం, ప్ర‌యోజ‌నాలను స‌వివ‌రంగా వివరించారు.
ఈ సంద‌ర్భంగా ప‌లువురు ల‌బ్ధిదారులు వర్చువ‌ల్‌గా త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ ప్ర‌సంగానికి ముందు గంగ‌దేవిప‌ల్లిలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఆయా మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన జిల్లా అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించారు.
దీంతోపాటుగా వివిధ ప‌థ‌కాల‌ లబ్దిదారులు ఈ కార్యక్రమంలో ప్ర‌సంగించారు.
ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్రలో పాల్గొన్న లబ్దిదారులు ప్ర‌తిజ్ఞ చేశారు.
ఈ సంద‌ర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజ‌ర్ హ‌వేళి రాజు మాట్లాడుతూ, విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ద్వారా క్షేత్ర‌స్థాయిలో ప‌థ‌కాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు చేర‌వేస్తున్నామ‌ని,ప్రజలు ఈ పథకాలను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.
ఈ కార్య‌క్ర‌మం నోడ‌ల్ ఆఫీస‌ర్ & యూబీఐ గీసుగొండ‌ బ్రాంచ్ మేనేజ‌ర్ వి.విజ‌య్ మాట్లాడుతూ, బ్యాంకు వద్దకి విచ్చేసి తెలుసుకునే అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర‌వేస్తున్నామని వివ‌రించారు.
కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించిన విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర అధికారిక పాంప్లెట్స్, బుక్‌లెట్స్, క్యాలండ‌ర్‌ల‌ను ఆవిష్క‌రించారు.
యువ‌త‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కాలు,ప్రయోజనాలకి సంబంధించిన ఏకీకృత పోర్ట‌ల్ మైభార‌త్ వెబ్ సైట్ పై అవ‌గాహ‌న కల్పిస్తూ పాంప్లెంట్స్ విడుద‌ల చేశారు.
ఈ సంద‌ర్భంగా ప‌లువురు యువ‌త త‌మ వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు.
స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ వ‌రంగ‌ల్ క్షేత్ర ప్ర‌చార అధికారి శ్రీ‌ధ‌ర్ సూరునేని, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి అన్వేష్ చింత‌ల‌, స‌ర్పంచ్ గోనె మ‌ల్ల‌య్య‌, యూనియ‌న్ బ్యాంక్‌ డిప్యూటీ రీజిన‌ల్ హెడ్ ఎన్.శ్రీ‌నివాస్‌, డీఎంహెచ్ఓ వెంక‌ట‌ర‌మ‌ణ‌, డీడ‌బ్ల్యూఓ శారద‌, నాబ‌ర్డ్ డీడీఎం చైత‌న్య‌ర‌వి, మండల అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
క్షేత్ర‌స్థాయిలో ప్రజలకు ఉపయోగ పడే పథకాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకి తెలియ‌జేస్తుండ‌టం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking