ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బొమ్మరాస్పేట గ్రామా పంచాయతి కార్యాలయం దగ్గర జెండా ఊపి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన గవర్నర్, అధికారులు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ విషయంలో ప్రతి ఒక్కరిలోనూ ఆనందం కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్పేట మండలం బొమ్మరాస్పేట గ్రామా పంచాయతి కార్యాలయము దగ్గర భారత ప్రభుత్వం చేపటిన పథకాల గురించి వికసిత్ భారత్ సంకల్పయాత్రను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేశారు. తాను ఈ రోజు ఇక్కడకు రావడం అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉందని, మీరందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. . ప్రస్తుతం భాతర దేశం ప్రతి రంగంలోనూ అన్ని దేశాల్లో కంటే ముందు ఉందని,ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అన్ని సెక్షన్ల ప్రజలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. ప్రస్తుతం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనట్లయితే వారికి సంబంధించి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉందని,ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్యసేవలను పొందవచ్చని గవర్నర్ డాక్టర్ సౌందర రాజన్ వివరించారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని, దీనిని వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా పొగలేని గ్యాస్స్టవ్ ఇవ్వడం జరిగిందని,అనేక మంది గ్రామీణ ప్రజలకు పీఎం ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా అనేక మంది వ్యాపారులు యజమానులు అయ్యారు. ప్రధానమంత్రి రైతుబీమా ద్వారా అనేక మంది ప్రయోజనం పొందారన్నారు. ఈ విధంగా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సంకల్పం (ప్రతిజ్ఞ) చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ క్యాలెండర్, బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమము లో శాంతమను అడిషనల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.