ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం సెమీ క్రిస్మస్ సందర్భంగా శ్రీనగర్ కాలనీ 13వ లైన్ లో ఉన్న గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరపున సంఘస్తులు అందరూ కలిసి క్రిస్మస్ ర్యాలీనీ ఘనంగా నిర్వహించారు ఇందులో సంఘ కాపరి పాస్టర్ ఆనంద్ పాస్టరమ్మ ప్రసన్న మరియు సంఘస్తులు మల్లయ్య మోసెస్ మురళి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని యేసు ప్రభువు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్స్ పంచి క్రిస్మస్ అందాన్ని అందిరికి తెలియజేశారు . ఈ సందర్భంగా పాస్టర్ ఆనంద్ మాట్లాడుతూ క్రీస్తు యొక్క పుట్టక గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు లోక పాపముల నుంచి మనుషులను విడిపించడా నికి వచ్చిన రక్షకుడని వీధులలోని జనములంద రికీ సువార్త ప్రకటించారు చిన్న పిల్లల నృత్యలు క్రొవ్వొత్తుల ర్యాలీ అందరినీ ఆకర్శించాయి అనంతరం నిరుపేద వంటరి మహిళలకు నూతన వస్త్రాలు బహుకరించి దేవుని ప్రేమను చాటారు ఈ ర్యాలీని శ్రీనగర్ కాలనీ నుండి ప్రారంభించి రోటరీనగర్ మమతా హాస్పిటల్ రోడ్ లాకారం సర్కిల్ గొల్లగూడెం రోడ్ మీదిగా సుమారు 300 మంది విశ్వాసులుతో కొనసాగించారు